౨౮. సుర్యాస్తమయం
ఇది రాబోయే రాత్రికి, కాబోయే చీకటికి ఒక సంకేతం మాత్రమే కాదు.....
నలిగిన మనసుకు, అలసిన మనిషికి స్వాంతన చేకూర్చే సమయం!!!
అర్జున
౨౭. ప్రకృతి పాఠం
ప్రతి వసంతంలో చివురించే కొమ్మ.......మార్పు ప్రాముఖ్యాన్ని ఏమిటో
తెలియజేస్తుంది...
ఎంత ఎదిగినా భూమిలోనే వేళ్ళు అనే చెట్టు ........ ఒదిగి ఉండటం ఎంత అవసరమో తెలుపుతుంది
ఎప్పుడు ఆగకుండా కొట్టుకోనే గుండె..... కష్టపడడం ఎంత విలువైనదో నేర్పుతుంది
బొగ్గు వజ్రంగా మారడానికి పట్టిన కాలం........ ఓర్పుతో సాధించగలిగిందేమిటో
చూపుతుంది
మళ్ళి మళ్ళి తీరాన్ని తాకే అల... అలసట లేని ప్రయత్నాని
నేర్చుకోమ్మంటుంది
ఎన్ని అడ్డంకులు ఎదురైనా సముద్రాని చేరే నది...... లక్షం ఎంత
ముఖ్యమో తెలుసుకొమ్మంటుంది
అర్జున
౧౬. మనిషి – ఋతువు
కాకిలా ఈ కోకిల
కూతలు ఏమిటి అంటున్నావా?
చివురించిన
కొమ్మలనడుగు................. వసంతం ఎంత బాగుంటుందో
ఎండ తాపానికి మండి
పడుతున్నావా?
అరవిరిసిన
మల్లెపూలనడుగు................. గ్రీష్మం ఏమి చెబుతుందో
బురద అంటిన
కాళ్ళని చూసి కసురుకొంటున్నావా?
గలగల మని పారే
నదులనడుగు............వర్షఋతువు అవసరమెంతో
రాత్రి అంటే కేవలం
చీకటే అని బ్రమిస్తున్నవా?
చల్లని చంద్రుని
వెన్నెలనడుగు..............శరద్ఋతు ప్రాముఖ్యమేంటో
చివుక్కుమనే చలి
గాలులని విసుక్కుంటున్నావా?
ఆకురాల్చే
చెట్లనడుగు...................హేమంతo ఏం చేయమంటుందో
కళ్ళని కప్పే
పొగమంచుని తిట్టుకుంటున్నావా?
భోగి మంటల
వెచ్చదన్నానడుగు.......... శిశిరం నేర్పే పాఠం ఏమిటో
అర్జున
౧౫. మనోవ్యధ
మనోవ్యధ – ఆనందాన్ని ఆవిరి చేసే వికృతమిది
ఆలోచనలను అణగదొక్కే కారణమిది
మనోవ్యధ – అరాచకాన్ని ప్రోస్తహించే అతివాదమిది
ప్రాణం తీసేంత (తీసుకునేంత) ఉగ్రవాదమిది
మనోవ్యధ – పూత మందులకు లొంగని ఉపద్రవమిది
పతనాన్ని కాంక్షించే అజ్ఞానమిది
మనోవ్యధ – ఇది మనసుకు మాత్రమే అర్థం అవుతుంది
మనస్సు చదవగలిగిన వారికి మాత్రమే అర్థం అవుతుంది
అర్జున
౧౪. లాస్ వేగాస్ నగరం
తళుకుల బెళుకుల ఈ విశ్వవిక్యాత నగరం........ ఎందరి ఆశలకో ఓ విలాసం
రారమ్మనటుంది అందరిని ప్రతి నిత్యం...... జాగ్రత్తగా లేకపోతే చేడతారన్నది నగ్న సత్యం
అర్జున
౧౩. కోపం - ప్రేమ
మచ్చ ఉన్నంత మాత్రాన చంద్రుడు వెన్నెల కురిపించలేడు అంటామా?
గ్రహణంలో ఉన్నంత మాత్రాన సూర్యుడు ఇక ప్రకాశించాలేడు అనగలమా?
బూడిద రాసుకున్నంత మాత్రాన రుద్రుడికి మహిమలే లేవంటామా?
కోపం ఉన్నంత మాత్రనా మనిషికి ప్రేమించడమే తెలీదనగాలమా?
అర్జున
౧౨. గగన విహారం – ఓ మాయాజాలం
తెల్లగా కనిపించేదంతా పాలు కాకపోవచ్చు........ చీకటి ఉన్నంతమాత్రాన రేయి కానక్కర్లేదు
నలబై వేల అడుగుల ఎత్తులో
గగనమే క్షీరసాగరం అనిపిస్తుంది ....................... పగలు కూడా రాత్రిలా భ్రమిస్తుంది
అర్జున
౧౧. మానవుడు – దానవుడు
ప్రతి మనిషిలో రాముడున్నాడు; రావణుడున్నాడు
అహాన్ని జయించిననాడు రాముడు అవుతాడు
ప్రతి మనిషిలో సీతా ఉంది; శూర్ఫనఖ ఉంది
సహనం కోలుపోనినాడు సీత ఆవిష్కరింపబడుతుంది
ప్రతి మనిషిలో కృష్ణుడున్నాడు, కంసుడు ఉన్నాడు
మంచి తెలుసుకొన్న వాడే కృష్ణుడు అవుతాడు
ప్రతి మనిషిలో వామనుడున్నాడు; బలి చక్రవర్తీ ఉన్నాడు
చెడుకి అండగా లేనప్పుడు వామనుడిలా నిలుస్తాడు
ప్రతి మనిషిలో ప్రహ్లాదుడున్నాడు; హిరణ్యకశపుడు ఉన్నాడు
ద్వేష బావం తగ్గిననాడే హరి కనిపిస్తాడు
ప్రతి మనిషిలో నరుడున్నాడు; నారాయణుడున్నాడు
ఈ జీవితసత్యం అర్ధం అయితే; నరుడే నారాయణుడు అవుతాడు
అర్జున
౧౦. కాలం – సమాజం - మార్పు
కలసి ఉంటె కలదు సుఖం అన్నది నాటి తరం
సుఖం కోసం భందం / భాందవ్యం వదులుకుంటోంది నేటి తరం
అరచేతిలో వైకుంఠం చూపించడం అనేది ఆనాటి మాట
వైకుంఠం ఏం ఖర్మ! ముల్లోకాలు చూపించగలగడం నేడు పటిమ
అప్పుచేసి పప్పు కూడు అప్పటి జీవన విధానంలో భోగం
అప్పు చేసి; దాన్ని చెల్లించక పోవడం నేటి పెద్దల ప్రధాన లక్షణం
ఏతావాతా తేలిందేంటంటే... మారనిదొక్కటే
ధనం మూలం ఇదం జగత్ అన్నది ఆనాటి నానుడి
నేటి ఈ సమాజం చేస్తోంది దాన్ని అచ్చు తప్పకుండా రూఢ
అర్జున
౯. అరిషడ్వర్గ సమాజం
అర్జున
౯. అరిషడ్వర్గ సమాజం
ఈ సమాజంలో మదమెక్కిన కొందరికి
కామ పిశాచి ఆవహించింది
తల్లికి, చెల్లికి చివరకు బిడ్డకు తేడా లేకుండా చెరుస్తున్నారు
అహంకారం తలకెక్కిన కొందరు ప్రభువులు
లాభాపేక్షతో లోభులుగా మారినారు
ఓట్లు వేసిన ప్రజలను బానిసలను చేస్తున్నారు
మద మాత్స్తర్యాలు అంటించుకొన్న మరికొందరు
అధికార మొహానికి ప్రతీకలైనారు
ప్రజల మధ్య క్రోధాగ్ని రగిలిస్తున్నారు
అరిషడ్వర్గాలను జయించే మార్గం చూపాల్సిన గురువులు
తమ తమ ప్రభ ప్రాభవం కోసం కుమ్ములాడుతున్నారు
ఇప్పటికైతే ఇది అరిషడ్వర్గ విజయం... మారుతుందా ఎప్పటికైనా ఈ సమాజం?
అర్జున
౮. ఉన్మాదం
ప్రేమ పేరున ఉన్మాదం
పగ మత్తున ఉన్మాదం
మతం నీడన ఉన్మాదం
కులం చాటున ఉన్మాదం
ఆడవారిని చెరిచేంత ఉన్మాదం
మగవారిని అనగదోక్కెంత ఉన్మాదం
కడుపున పుట్టిన ఆడ పిల్లని చంపే అంత ఉన్మాదం
మగ పిల్లవాడిని కట్నం పేరున అమ్మే అంత ఉన్మాదం
ఇదే దేవుడి వాక్కు అంటూ ఉన్మాదం
ధర్మాన్ని నిలబెడుతున్నామంటూ ఉన్మాదం
ప్రపంచ శాంతి పేరిట ఉన్మాదం
బడుగు జీవుల ఉద్దరింపంటు ఉన్మాదం
సాటి మనిషిపై ద్వేషంతో ఉన్మాదం
సొంత మనుషుల ప్రీతి పేర ఉన్మాదం
మానవ చరిత్ర మొత్తం ఉన్మాదం
శాంతి కాముకులం అని చెప్పడంలోనే ఉంది పెద్ద ఉన్మాదం
అర్జున
౭. ప్రేమ
ప్రేమ ఒక అందమైన అనుభూతి
ప్రేమ ఒక ఆద్భుతమైన శక్తి
తల్లి లాలనలో ఉంది ప్రేమ
తండ్రి జాగ్రత్తలో ఉంది ప్రేమ
తోబుట్టువు చిలిపి తగాదాలో ఉంది ప్రేమ
గురువు మందలింపులో ఉంది ప్రేమ
స్నేహితుని సాన్నిహత్యంలో ఉంది ప్రేమ
ఇష్ట దైవపూజలో ఉంది ప్రేమ
జీవితభాగస్వామి అధికారంలో ఉంది ప్రేమ
పిల్లల కోరికలలో ఉంది ప్రేమ
మనమలతో ఆటలలో ఉంది ప్రేమ
మనిషి జీవితం మొత్తం ప్రేమ
కాబట్టి మనిషి ప్రేమను గుర్తించు
ఎందుకంటే
ప్రేమ ఒక అందమైన అనుభూతి
ప్రేమ ఒక ఆద్భుతమైన శక్తి
అర్జున
౬. నేటి మనిషి
జీవితం విలువైనది
ప్రేమ అద్బుతమైనది
మనిషి ద్వేషం నేర్చుకుంటున్నాడు
సమయం విలువైనది
శ్రమ పవిత్రమైనది
మనిషి అడ్డదారులు తొక్కుతున్నాడు
ప్రాణం వెలకట్టలేనిది
తెలివి నలుగురికి ఉపయోగపడాల్సింది
మనిషి తెలివితో ప్రాణం తీస్తునాడు ( తీయడం నేర్చుకొంటున్నాడు)
మతం మానవత్వాన్ని పంచేది
కులం జీవన విదానాన్ని నేర్పేది
మనిషి కుల మతాల మొహంలో కొట్టుకోపోతున్నాడు
ప్రపంచం వసుధైక కుటుంబకం
కుటుంబం ఒక అందమైన ప్రపంచం
మనిషి మనిషి మనిషికి (మనస్సు మనస్సుకి) అడ్డుగోడలు కట్టడం నేర్చుకొంటున్నాడు
దైవత్వం ఒక ఒక అందమైన అనుభూతి
దేవుడు ఒక అద్భుతమైన ఆశ
మనిషి దేవుడిని వ్యాపారానికి వాడుకుంటున్నాడు
అర్జున
౫. భయం.
నేటి మనిషికి
మానం అంటే భయం.....చెడగోడ్తారేమోనని
ప్రాణమంటే భయం......తీసేస్తారేమోనని
నేటి మనిషికి
ప్రశ్న అంటే భయం.....జవాబు దొరకదేమోనని
జవాబంటే భయం......ఏమి వినాల్సివస్తుందోనని
నేటి మనిషికి
లక్షం అంటే భయం.....చేరలేమోనని
గమ్యం అంటే భయం......ఎదురు దెబ్బలు తగులుతాయేమోనని
నేటి మనిషికి
దేవుడంటే భయం..... కోరికలు తీర్చడేమోనని
నాయకులంటే భయం...... ఏమి కోతరారోనని
నేటి మనిషికి
బ్రతుకంటే భయం.....బ్రతకలేనేమోనని
చావంటే భయం......బ్రతకనివ్వదని
ఒక్క మాటలో చెప్పాలంటే......నేటి మనిషికి
భయమంటే భయం....భయపెడుతుందేమోనని
అర్జున
౪. ఆనందం... అవధి లేని ఆనందం
అవధి లేనిది ఆనందం..
విరగ కాసిన పైరుని చూస్తే ఆనందం
సిరిమల్లెల పరిమళ్ళాలో ఆనందం
జలపాతపు ఝరిలో ఆనందం
అమ్మ చేతి స్పర్శలో ఆనందం
చంటిపాప బోసి నవ్వులో ఆనందం
పండు ముదుసలి తృప్తిలో ఆనందం
ప్రతి గెలుపులో ఆనందం
కొన్ని ఓటముళ్ళో ఆనందం
నీ చుట్టూ ఎన్నింటిలోనో ఆనందం.
ఆస్వాదించడం నేర్చుకో ఎందుకంటే....
అవధి లేనిది ఆనందం.......
అంతం కానిది ఈ ఆనందం...
అర్జున
౩. నిశీధి తరువాత
ఉషోదయం తప్పదు ప్రతి నిశీధి తరువాత
పౌర్ణమి రాక మానదు అమావాస్య తరువాత
వర్ష ఋతువు నేనున్నానంటుంది గ్రీష్మమ్ తరువాత
ప్రయత్నిస్తే గెలుపు నీదే ఓటమి తరువాత
రోజులు అన్నీ ఒకేలా ఉండవు అన్నది సత్యం
ప్రయత్నం ముఖ్యం, ఫలితం కాదన్నది గీతా సారం
కష్టం ఇవ్వకపోదు కోరుకున్న ఫలితం అన్నది భారతీయ తత్వం
చేయి నువ్వు నీ ప్రయత్నం... దశ దిశ మారతాయన్నది లిఖితమ్!
అర్జున
౨. మనస్సు
మనస్సు చంచలమైనది ----
ఒక పనిని చేయమంటుంది
దాన్నే చేయొద్దంటుంది
మనస్సు సున్నితమైనది----
చిన్న విషయానికే సంతోషిస్తుంది
దానికన్నా చిన్నవిషయానికే బాధపడుతుంది
మనస్సు ఖటినమైనది ----
ప్రేమను పంచుతుంది / పెంచుతుంది
ఆ ప్రేమనే తుంచుతుంది
మనస్సు జటిలమైనది -----
మనిషిని మనిషిగా ఉంచుతుంది
మనిషిని మృగాన్ని చేస్తుంది
ఓ మనిషి మనస్సుని అదుపులో ఉంచుకో!
ఓ మనిషి మనస్సుని అదుపులో ఉంచుకో!
లేదా ........ మృగాన్ని చేస్తుంది
అర్జున
౧. మనిషి ఓ మనిషి
మనిషి ఓ మనిషి! నీది ఒక జన్మేనా
జ్ఞానం గొప్పదంటావు
ధనం తుచ్చమంటావు
ధనంకోసం జ్ఞానాన్నే త్యజిస్తావు
మనిషి ఓ మనిషి! నీది ఒక జన్మేనా
స్నేహం గొప్పదంటావు
ప్రేమ పవిత్రమైనదంటావు
స్నేహం ప్రేమ మధ్య తేడా తెలుసుకోలేవు
మనిషి ఓ మనిషి! నీది ఒక జన్మేనా
ఎంతో సాదించాలనుకుంటావు
సంపాదన ముఖ్యం కాదంటావు
సంపాదన ధ్యాసలో సాధన మరుస్తావు
మనిషి ఓ మనిషి! నీది ఒక జన్మేనా
తల్లే దేవతంటావు
ప్రేయురాలే ఇష్టం అంటావు
ప్రియురాలి ధ్యానంలో తల్లినే చులకన చేస్తావు
మనిషి ఓ మనిషి! నీది ఒక జన్మేనా
లోకం మారాలంటావు
జనం మారి పోవాలంటావు
నీలో మార్పుకై ప్రయత్నం చేయవు
మనిషి ఓ మనిషి! నీది ఒక జన్మేనా
అర్జున