వారం వారం - కొత్త సమాచారం (కొత్త సంచిక)

ప్రతి ఆదివారం, నేను తెలుసుకొన్న, నేర్చుకున్న, నాకు కొత్తగా అనిపించిన ఒక తెలుగు పదమో,  సామెతో, జాతీయమో, పద్యమో  (తాత్పర్య సహితంగా) నా ఈ పుటలో (page) పంచుకొందామనుకొంటున్నాను.


నా ఈ కొత్త ప్రయత్నం అందరికి నచ్చుతుందనుకుంటూ ..

_______________________________________________________

12/29/2024 - ఇవాళ్టి శీర్షిక కొత్త పదం (పదాలు).. త్యాగరాజస్వామి కీర్తన నుండి.. 

నేను ఈ మధ్యలో త్యాగరాజస్వామి రచించిన “నగుమోము కనలేని”  కీర్తన వినడం జరిగింది.  అందరికీ తెలిసినట్లే, నాకు కూడా ఈ కీర్తన త్యాగరాజ స్వామి శ్రీరామచంద్ర మూర్తిని స్తుతిస్తూ వ్రాసారు అని తెలుసు కానీ, ఒక్క రెండు పదాలకి నాకు తెలిసిన అర్థం సరిచూసుకోవడానికి కొంచం సమయం పట్టింది.. అవే 


  1. నగరాజాధర

    1. నగము అంటే … కొండ / పర్వతాలు

    2. నగరాజ అంటే…  పర్వతాలకు రాజు / గొప్ప పర్వతము 

    3. నగరాజాధర అంటే …గొప్ప పర్వతాన్ని ఎత్తినవాడు .. అంటే.. విష్ణువు.. 

విష్ణువు నాకు తెలిసి రెండు అవతారాలలో పర్వతాన్ని ఎత్తాడు /  మోశాడు 

కూర్మావతారంలో మంథర పర్వతాన్ని 

కృష్ణావతారంలో గోవర్ధనాన్ని 

ఎలాచోసుకొన్న - అంట పెద్ద / గొప్ప పర్వతాన్ని మోసిన విష్ణుమూర్తి అని ఈ మాటకు అర్థంగా నాకు తోచింది. 


  1.  ఖగరాజు 

    1. ఖగము అంటే ..... పక్షి 

    2. ఖగరాజు అంటే …. పక్షులకు రాజు… గరుడ పక్షి 


మొత్తం మీద.. ఇవి అంత కష్టమైన మాటలు కాకున్నా.. నాకు తెలిసిన అర్థాన్ని సరిచూసుకోవడానికి కొంచం సమయం ఐతే పట్టింది.. ముఖ్యంగా నగరాజాధర…ఈ పదం ఎన్ని నిఘంటువుల్లో వెతికినా దొరకలేదు..   మీకు తెలిసిని ఈ అర్థాలను ఆసరాగా చేసుకొని.. మళ్ళీ ఒక్క సారి “నగుమోము” వినండి.. 


English version


Recently, I was listening to Tyagaraja Swami's composition, "Nagumomu Ganaleni". As most of us know, (including me) that Tyagaraja Swami composed this keerthana in praise of Sri Ramachandra Murthy. However, I took some time to verify the meaning of a couple of words. Those are…


  1. Nagaraajaadhara - 

    1. Nagamu means... mountain / mountains 

    2. Nagaraja means... king of mountains / great mountain 

    3. Nagarajaadhara means... one who lifted the great mountain, meaning Vishnu. 

As far as I know, Vishnu lifted a mountain in two of his avatars. In the Kurma avatar, he lifted Mount Mandara. In the Krishna avatar, he lifted Mount Govardhana. So, I understand this word to mean Vishnu, the one who lifted the great mountain.

  1. Khagaraaju 

    1. Khagamu means... bird 

    2. Khagaraaju means... king of birds, Garuda.

All in all, while these aren't exactly difficult words, it took me some time to verify the meanings I knew, especially 'Nagaraajaadhara'. I couldn't find this word in any known telugu dictionary. Based on the meanings, please listen to 'Nagumomu' one more time and enjoy the meaning.


____________________________________________________________________________

12/23/2024 (కొద్దిపాటి మార్పులతో) ఇవాళ్టి శీర్షిక - తెలుగు సామెత 

తెలుగు లో


సామెత:  బడితె ఉన్నవాడిదే బఱ్ఱె  


ప్రతిపదార్థం:


బడితె : కర్ర / ఎండిన లావుకఱ్ఱ / మాములుగా ధ్యానం లేదా గింజలు రాల్చడానికి వాడే బలమైన కర్ర 

ఉన్నవాడిదే : ఎవ్వరి దెగ్గర ఉందో 

బఱ్ఱె : ఎనుము / బర్రెగొడ్డు / water buffalo  


తాత్పర్యము: ఎవ్వరి దగ్గర లావుపాటి కర్ర ఉందో.. వాళ్లదే బఱ్ఱె


ఈ సామెత ఒకప్పుడు ఉళ్ళోలో ఉన్న  సామాజిక పరిస్థితులని తెలియచేస్తుంది.. ఇప్పటికీ చాలా చోట్ల మన సమాజంలో అధికారమో, ధనమో, వర్గమో, లేక మరే విధమైన బలమో ఉన్నవారు మిగతా వారిని ఎలా ఎదగనివ్వరో మనం చూడొచ్చు.. అంటే ఈ సామెత ఆధునిక సమాజంలో ఉండే ఆటవిక సామ్రాజ్యానికి కూడా ఒక గుర్తు. 


కొసమెరుపుగా మీలో చాలామంది విన్న పదం : బడితెపూజ 🙂.. దీని అర్థం అందరికి తెలుసు అనుకుంటున్నాను..


వచ్చేవారం వరకు శెలవు!!!!

  


English version


Telugu saying: “Badite unna vaadide barre”


Meaning:  “He who has a stick owns the buffalo” - This proverb reflects the social conditions that once existed in villages. Even today, we can see in many places how those with power, wealth, status, or other forms of strength prevent others from progressing. In other words, this proverb also symbolizes the primitive kingdom that exists in modern society. The closest proverbs in English (that I could come up with) are: “Might makes right.” or  "The strong do what they can, and the weak suffer what they must."


See you all next week!


____________________________________________________________________________

12/15/2024 - ఇవాళ్టి శీర్షిక వేమన పద్యం

ఈ రోజు నేను యోగి వేమన చెప్పిన ఒక పద్యం ఇక్కడ ప్రస్తుతిస్తున్నాను.. ముందుగా యోగి వేమన గురించి చిన్న పరిచయం. ఈయన అసలు పేరు.. వేమా రెడ్డి.. ఈయన దాదాపుగా 1650 దశకానికి చెందిన రాయలసీమ వాసి అని ఒక అంచనా. ఈయన ఒక గొప్ప తత్వవేత్త మరియు కవి. ఈయన దాదాపుగా 5000 పైగా పద్యాలూ వ్రాసారు అని అంచనా.. కాకపొతే వేమన శతకం చాలా ప్రసిద్ధి.. ఏరికోరి కూర్చిన 100 పద్యాలనూ శతకం అంటున్నారు.. ఈయన వ్రాసిన ఈ తాత్విక పద్యాలూ ప్రజా బాహుళ్యంలోకి రావటానికి ఒక ముఖ్య కారణం సి. పి . బ్రౌన్. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్ గా వచ్చి ఈయన తెలుగు భాషకు చేసిన సేవ అజరామరం. 


ఇప్పుడు పద్యం (ఇది మాములుగా మనం వినేది / చదివేది కాదు). 


శాంతమే జనులను జయము నొందించు

శాంతముననె గురువు జాడ తెలియు 

శాంత భావ మహిమ చర్చింపలేమయా 

విశ్వధాభిరామ వినుర వేమా! 


తాత్పర్యం : శాంతంగా ఉంటె మనకు గెలుపు దక్కుతుంది, శాంతంగా ఉండటం వలన మంచి గురువులు దొరుకుతారు, తద్వారా అనుకున్నవి సాధించగలం. అటువంటి శాంత స్వభావం గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని వేమన అంటున్నారు.. (దీని అర్థం ఎప్పుడూ శాంతంగా మాత్రమే ఉండాలని కాదు, అవసరం అయినప్పుడు మాత్రమే పౌరుషం వస్తే చాలు అని).. 


ఈ పద్యం ఎన్నుకోవడానికి కారణం..తన కోపమే తన శత్రువు అనే  సుమతి శతక పద్యం చాలామందికి తెలుసు, కానీ ఈ వేమన పద్యం అంతటి ఆణిముత్యమే అయినా అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు.. 


కొత్త వేమన పద్యం తెలుసుకొని ఆనందించారు అనుకొంటూ.. మళ్ళీ వచ్చేవారం కలుద్దాం.. 


 English version:

 Today, I present to you a verse by Yogi Vemana. A brief introduction to Yogi Vemana: His real name was Veema Reddy. It is estimated that he lived in Rayalaseema around the 1650s. He was a great philosopher and poet. It is estimated that he wrote over 5000 verses, but the Vemana Shatakam is very famous. A collection of 100 carefully selected verses is called a Shatakam. A  British officer (East India Company) named C.P. Brown played a big role in making Vemana's poems popular, especially among the common people. 

The poem:

Shanta janulanu jayamu nondinchu

Shantamunane guruvu jaada teleyu

Shantabhava mahima charchimpalemayaa

VishvadhabhiRaama Vinura Veema!


Meaning: If we remain calm, we will achieve victory. By staying calm, we will find good teachers, and thus we can achieve our goals. Vemana says that no matter how much we speak about such a peaceful nature, it is too little. (This does not mean that we should always be calm; it only means that we should show courage when necessary.)

The reason for choosing this verse is that while many people know the verse from the Sumati Shatakam that says 'one's anger is one's enemy', this verse by Vemana, though equally valuable, is not as widely known.

I hope you enjoyed learning the new Vemana verse. Let's meet again next week.

____________________________________________________________________________

12/08/2024 - ఇవాళ్టి అచ్చ తెలుగు పదం:

ఎల్లి . తెలుగులో ఎల్లి అంటే మరుసటి రోజు (tomorrow). 

మనము మామూలుగా మరుసటి రోజుకు తెలుగులో వాడే పదం రేపు. కానీ రేపు అంటే అసలు అర్థం ఉదయం అని. మరుసటి రోజు అని కాదు. 

మనందరం ఎప్పుడో అప్పుడు “రేపో - మాపో” అని వాడి ఉంటాం.. అంటే.. పొద్దునో - సాయంత్రమో అని అర్థం.. కానీ, కాలక్రమేణా… మరుసటి ఉదయం కాస్త.. మరుసటి రోజు గా మారిపోయింది.. 


ఎల్లి నుంచి వచ్చిందే ఎల్లుండి (day after tomorrow). ఎల్లుండి మాత్రం రూపాంతరం చెందలేదు.. 



English version:


I am hoping to share a new Telugu word, saying, or a poem (with meaning) in this group every Sunday starting today. Hopefully, you will enjoy this new series and this opens up many more discussions on this wonderful language. 


Today’s Telugu word. “Elli” - Elli in Telugu means tomorrow in English. The word that is usually used to represent tomorrow in Telugu is “Repu”, but that actually means dawn (early morning hours of the next day). Most of us would have used the expression “Repo - Maapo”,. In this expression, we all know mapo means evening or night. Now if you think, it makes sense to say, either in the morning or night, but not tomorrow or the night. But as most of the people started using next morning (repu) as a colloquial word to represent the next day, repu has become the next day. 


If you also look at the Telugu word for day-after-tomorrow (ellundi), we can understand it was derived from Elli.. Elli → next day (tomorrow) and Ellundi → Day after tomorrow. This telugu word did not change much. 



Source: Garikapati gaari video on youtube : https://www.youtube.com/watch?v=aGaln6P22FQ